

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జేసన్ సంజయ్‌ను హీరోగా పరిచయం చేసే చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. తన తొలి సినిమా కోసం ఆయన కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు దర్శకులు కథలు వినిపించగా, ప్రముఖ దర్శకుడు లింగుసామి కూడా వారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, జేసన్ సంజయ్ తొలి చిత్రానికి విక్రాంత్ సోదరుడు సంజీవ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను సంజీవ్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అయితే, నిర్మాణ సంస్థ, దర్శకుడు, కథాంశానికి సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ తనయుడు హీరోగా పరిచయం కానుండటంతో ఆయన తొలి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!