

రాజా సాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ అభిమానులకు మరో భారీ అప్డేట్ అందనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కల్కి పార్ట్–2 షూటింగ్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. తొలి భాగం ముగిసిన విధానం చూస్తే, రెండో భాగంలో కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం కథలో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ యుద్ధ సన్నివేశాల కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంలో బిజీగా ఉన్నారు. అయితే కల్కి పార్ట్–2కు ప్రాధాన్యత ఇస్తూ, స్పిరిట్ షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చి కల్కి సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు టాక్. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు వైజయంతీ మూవీస్ నిర్మాతలు కూడా త్వరలోనే కల్కి 2 పనులు ప్రారంభమవుతాయని హింట్ ఇవ్వడంతో, ఫిబ్రవరి నుంచే షూటింగ్ స్టార్ట్ కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరిలో రాజా సాబ్ విడుదల, ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్, డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే పండగ వార్త.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!