

ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు వస్తోంది. దర్శకుడికి అంతకు మించిన సినిమా చేసే అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో ఈ స్థాయి సక్సెస్ సాధించాడు. కాబట్టి అతని కోసం ఇండియా లో ఉన్న స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కాబట్టే ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు అతని కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
సంజయ్ లీలా భన్సాలీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ వంటి దర్శకులు అల్లు అర్జున్ కోసం కథలను సిద్ధం చేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖ దర్శకులు కూడా అతనితో పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా, 2500 కోట్ల వరకు కలెక్షన్ సాధించగలదని మేకర్స్ నమ్ముతున్నారు. సినిమా ఎవర్ గ్రీన్ సక్సెస్ అయితే, అల్లు అర్జున్ క్రేజ్ సూపర్ స్టార్ స్థాయికి చేరుతుంది. రాబోయే కాలంలో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటే, అతను మరింత స్థిరంగా టాప్ హీరోగా నిలవగలడు.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!