

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈవో ఎం. రవిచంద్ర యోగాభ్యాసం మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, సర్వతోముఖ వికాసానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 7 నుండి 21 వరకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. యోగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందిస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, అలాగే టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల21న ఉదయం 6 గంటలకు తిరుపతి పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించి అనంతరం భారీ యోగా అవగాహన ర్యాలీ చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!