

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. సీబీఐ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించనుంది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సోమవారం శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి పాత్రకు సంబంధించి గతంలోనే ఈడీ విచారణ చేపట్టింది. తాజాగా శివశంకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 14న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థ మరింత సమాచారం సేకరించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!