
క్రీడలు

విశాఖపట్నం మరోసారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కేంద్రంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. FY26 అంచనాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం ₹6.58 లక్షలతో విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం విజయవాడ పరిధిలోని కృష్ణా జిల్లా ₹4.81 లక్షలతో రెండో స్థానంలో, ఎన్టీఆర్ జిల్లా ₹3.91 లక్షలతో మూడో స్థానంలో నిలిచాయి.
జిల్లాల స్థూల ఉత్పత్తి (GDP)లో కూడా విశాఖ అగ్రస్థానంలో నిలిచి ₹1.61 లక్షల కోట్ల విలువ నమోదు చేసింది. మరోవైపు పోలవరం ₹6,831 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలు కూడా ఆర్థిక పరంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఈ గణాంకాలు విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలక కేంద్రంగా మారుతున్నదాన్ని స్పష్టం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!