
జనరల్

హెచ్-1బీ, ఎల్-1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులపై ఆలోచిస్తోంది. 9-11 రెస్పాన్స్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు పరిధిని విస్తరించి, పెద్ద కంపెనీలు సమర్పించే పిటిషన్లకు ఈ ఫీజులను వర్తింపజేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఫీజులు ప్రధానంగా కొత్త వీసా పిటిషన్లు, ఉద్యోగదాత మార్పుల సందర్భాల్లో మాత్రమే వర్తిస్తున్నాయి. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎల్-1బీ రెన్యూవల్ దరఖాస్తులకు కూడా ఫీజులు చెల్లించాల్సి రావచ్చు. దీంతో అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు, వారిని నియమించే కంపెనీలు ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!