

తిరుమలలో నిఘా వైఫల్యం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సాధారణంగా భక్తులు లోపలికి వెళ్లే ముందు తనిఖీలు చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. అయితే ఈ ఘటనలో భద్రతా తనిఖీలను దాటుకుని ఫోన్ లోపలికి వెళ్లడం గమనార్హమైంది. పోస్టును అధికారులు తొలగించారు, ఘటనపై తితిదే విజిలెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థను నిరంతరం అమలు చేస్తున్నామని తితిదే స్పష్టం చేసింది. వందల మంది భద్రతా సిబ్బంది తనిఖీలు, స్కానింగ్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపింది. మొదటి దశలో గుర్తించని వస్తువులను రెండో, మూడో దశల్లో గుర్తిస్తున్నామని వివరించింది. అయినప్పటికీ జరిగిన ఘటనపై సమగ్ర పరిశీలన జరుగుతోందని అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!