

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసే పోస్టులను యాప్‌లో కనిపించే ముందే చూడాలనుకునే వారి కోసం ప్రత్యేక API సబ్‌స్క్రిప్షన్ సేవను కంపెనీ ప్రకటించింది. ఈ సేవలో అత్యున్నత ప్లాన్ ధర నెలకు లక్ష డాలర్లు కాగా, ట్రూత్ సోషల్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇతర ప్రముఖుల పోస్టులను ముందుగానే పొందాలంటే వారి స్థాయిని బట్టి 60 వేల నుంచి లక్ష డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ వెల్లడించారు.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సంస్థలు, బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, వ్యక్తులు కూడా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ట్రూత్ సోషల్‌లో ట్రంప్ కుటుంబ సభ్యులే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారిలో ఉండటంతో ఈ కొత్త సేవ వారి వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కంపెనీ నుంచి అధికారిక స్పందన మాత్రం వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!