
సినిమాలు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి హెజ్‌బొల్లాపై దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. టెల్‌అవీవ్‌ను ఉద్దేశించి “కొంచెం బుర్ర వాడండి” అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఓ మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను ఇజ్రాయెల్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు తెలిపారు. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలు ఇరాన్‌తో శాంతి ప్రయత్నాలపై ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ అధికారులతో సంయమనం పాటించాలని చెప్పినట్లు వెల్లడించారు. అయితే ప్రధాని నెతన్యాహుతో మాట్లాడిన విషయంపై స్పష్టత ఇవ్వలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!