
జనరల్

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, బుధవారం నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. 2017లో చివరిసారిగా అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించిన ట్రంప్, తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి వెళుతున్నారు.
ట్రంప్ బుధవారం సాయంత్రం కల్లా బీజింగ్ చేరుకోనున్నారు. గురు, శుక్రవారాల్లో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు షి జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరాన్ యుద్ధ పరిస్థితులు, హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ భయాల మధ్య ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!