

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే బీజేపీని విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల సరిహద్దులను మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోందని ఆయన ఆరోపించారు. ఓటర్ల అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేకపోయినా, నియోజకవర్గాల విభజన విధానం మారితే ఎన్నికల ఫలితాలు మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఓట్ల పంపిణీ ప్రభావితమై, ఒక పార్టీకి ప్రయోజనం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తన వాదనను వివరించేందుకు ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఒక నియోజకవర్గంలో వెయ్యి మంది ఓటర్లు ఉండి, వారిలో 400 మంది బీజేపీకి, 600 మంది ప్రతిపక్షానికి మద్దతు ఇస్తే ప్రస్తుత పరిస్థితిలో ప్రతిపక్ష అభ్యర్థి గెలుస్తారని తెలిపారు. అయితే, అదే నియోజకవర్గాన్ని 500 మంది ఓటర్ల చొప్పున రెండు స్థానాలుగా విభజిస్తే, ఒక చోట బీజేపీకి 260 ఓట్లు, మరోచోట 140 ఓట్లు వచ్చేలా సరిహద్దులు మార్చే అవకాశం ఉందని వివరించారు. అలా చేస్తే ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల అభిప్రాయాలు మారకుండానే కేవలం నియోజకవర్గాల సరిహద్దుల మార్పుతో ఎన్నికల ఫలితాలు ప్రభావితమవుతాయని అభిజిత్ దీప్కే ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!