
సినిమాలు

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జహీద్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న అతడు సోషల్ మీడియా ద్వారా టెర్రర్ గ్రూపులతో సంబంధాలు పెంచుకుని, ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా జహీద్ ఖాన్ వద్ద నుంచి ఒక నకిలీ పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆన్‌లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా కార్యకలాపాలు మరియు ఇతర సంబంధాలపై భద్రతా సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!