
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులు ప్రధాని మోదీపై ఎల్లవేళలా ఉండాలని గవర్నర్ ప్రార్థించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత దిశగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో ప్రధాని మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!