

తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో నిందితుడికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ 40 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. నిందితుడు ప్రథమ్ సింగ్‌కు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
ఫిర్యాదు ప్రకారం 2023 మే 30న హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ఘటన జరిగినప్పటికీ, 2025 డిసెంబరు 26న మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసులో కీలక అంశంగా మారింది. ఫిర్యాదు నమోదు చేయడంలో రెండున్నరేళ్ల జాప్యం ఎందుకు జరిగిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వయసు 40 సంవత్సరాలు, నిందితుడి వయసు 38 సంవత్సరాలని న్యాయవాది వెల్లడించగా, ధర్మాసనం ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే నిందితుడు విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టును కోర్టులో జమ చేయాలనే అంశంపై కింది కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు కల్పించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!