

ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్నోకు చెందిన ఔట్సోర్సింగ్ సంస్థ టీడీపీఎల్ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీఐడీతో దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే పరీక్షల రద్దుతో విద్యార్థుల ఆందోళనకు తెరపడలేదు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వతంత్ర దర్యాప్తు జరగాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణతోనే తమకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!