
ఓటీటీ

హైదరాబాద్‌లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఆరోపణలపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!