
గాసిప్స్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం కల్పవృక్ష వాహనంపై స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. బకాసుర వధ అలంకారంలో స్వామివారు, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ జరగనుంది. ఈ సేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ, అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, భక్తుల రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా గురువారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుమలలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!