

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన రాజేశ్ (25)గా గుర్తించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్ నాచారంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. అనంతరం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి చెరువులోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
రాజేశ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెరువులో దూకిన రాజేశ్ మృతదేహం కోసం ఎన్డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అతడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!