

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో హత్యకు గురైన తెలంగాణ యువకుడు కుంచ అన్షుల్ (28) హత్య వెనుక పథకం ప్రకారమే నకిలీ పిజ్జా ఆర్డర్ పెట్టారని అతని సోదరి తన్వి ఆరోపించారు. ఎవరూ నివసించని ఇంటికి పిజ్జా పంపేలా చేసి తన సోదరుడిని అక్కడికి రప్పించి హత్య చేశారని ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఎవరిపైనా తమకు ప్రత్యక్ష అనుమానం లేదని, కానీ హత్యకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.
భావోద్వేగానికి గురైన తన్వి, తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపే విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అన్షుల్ గత నాలుగేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడని తెలిపారు. అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని అధికారులను కోరారు. ఇదిలా ఉండగా, నిందితుల గురించి సమాచారం అందించిన వారికి 20,000 డాలర్ల బహుమతి ప్రకటించినట్లు ఫిలడెల్ఫియా పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ అవసరమైన సహాయం అందిస్తామని ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!