

వైట్ హౌస్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక విదేశాంగ నిర్ణయాల నుంచి దూరంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తన ప్రణాళికలను కూడా ఆయన వెనక్కి తీసుకోవచ్చని సమాచారం. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థి కాదని, ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా తన బాధ్యతలపై దృష్టి పెట్టుతున్నానని పేర్కొన్నారు. ఇదే సమయంలో మార్కో రూబియోతో ఆయనకు తెర వెనుక పోటీ కొనసాగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక జాతీయ నిఘా డైరెక్టర్‌గా పనిచేసిన తులసి గబ్బార్డ్ క్యాబినెట్ నుంచి వైదొలగడం కూడా ఈ పరిణామాలకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ వ్యవహారాలపై వ్యూహాత్మక చర్చల్లో అనుభవజ్ఞుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్పై యుద్ధం విషయంలో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వాన్స్ విభేదిస్తున్నట్లు సమాచారం. అణ్వాయుధాల విస్తరణ ప్రపంచానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించగా, ఈ విషయంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్‌పై దూకుడుగా వ్యవహరిస్తున్న రూబియోతో ట్రంప్ కీలక వ్యూహాలను పంచుకుంటున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!