

రేపు నిర్వహించనున్న ప్రధానమంత్రి సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సుమతి తెలిపారు. సుమారు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సభకు డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు నిషేధించారని ఆమె పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు. సభ కోసం 12 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని, అక్కడ QR కోడ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. జిల్లాల నుంచి సుమారు 3,200 బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ వద్ద బస్సులు పార్క్ చేసి మెట్రో ద్వారా సభకు చేరుకోవాలని సూచించారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!