
జనరల్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ మరోసారి దూరప్రాంత లక్ష్యాలను డ్రోన్ దాడులతో ఛేదించింది. రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో ఉన్న చమురు కేంద్రంపై ఉక్రెయిన్ జరిపిన దాడితో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమ తాజా సుదూర డ్రోన్ దాడి అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దట్టమైన నల్ల పొగతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశారు. రష్యా అధికారులు ఈ దాడిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఇక ఉక్రెయిన్ పౌర ప్రాంతాలపై రష్యా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఖర్కివ్ ప్రాంతంలో జరిగిన రాత్రి దాడుల్లో 8 మంది గాయపడ్డారని, సుమీ ప్రాంతంలో 60 ఏళ్ల మహిళ మరణించినట్లు రష్యా అధికారులు తెలిపారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!