
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఎన్నికల సంఘం, సెంట్రల్ జీఎస్టీ అధికారులను కోరారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన అమెరికాలో అభిజీత్ దిప్కే చదువులకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చారనే అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అమిత్ తివారీ పేర్కొన్నారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిధుల వనరులు, పార్టీ చట్టబద్ధతపై కూడా పరిశీలన జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. రాజకీయ పార్టీల నిధుల పారదర్శకత, ఆర్థిక వ్యవహారాలపై బాధ్యత వంటి అంశాలపై నెటిజన్లు చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!