
బిజినెస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమీక్షించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!