9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బండి సాయి బగీరథ్‌కు హైకోర్టులో ఊరట

Writer: Pooja 11:46 AM, 9 అక్టోబర్, 2026
బండి సాయి బగీరథ్‌కు హైకోర్టులో ఊరట

రాజకీయ నాయకుడి కుమారుడు బండి సాయి బగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని తెలంగాణ హైకోర్టు సోషల్ మీడియా వేదికలు, టీవీ ఛానళ్లను ఆదేశించింది. తనపై నమోదైన కేసు వివరాలను వివిధ మాధ్యమాలు పదేపదే ప్రసారం చేస్తున్నాయని, వాటిని నిలువరించాలని కోరుతూ సాయి బగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా 2026 మేలో పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) నిబంధనల కింద కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసులో జూలై 9న సాయి బగీరథ్‌కు సాధారణ బెయిల్ మంజూరైనప్పటికీ, ప్రసారాలు కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా కేసుతో ముడిపెట్టి ప్రసారం చేస్తున్నారని, దీనివల్ల ప్రతిష్ఠకు నష్టం కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసు ఇంకా న్యాయస్థానం పరిధిలో ఉండగానే మీడియా ట్రయల్ తరహాలో ప్రచారం కొనసాగుతోందని, కొన్ని ప్రసారాల్లో తన తరఫు న్యాయవాదులపైనా ఆరోపణలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. పోక్సో కేసుకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా వేదికలు, టీవీ ఛానళ్లను ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో పాటు గూగుల్, మెటా, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, పలు టీవీ ఛానళ్లు నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...

తెలంగాణలో రేపటి నుంచి దసరా సెలవులు

తెలంగాణలో రేపటి నుంచి దసరా సెలవులు

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుబండి సాయి బగీరథ్పోక్సో కేసుమీడియా ప్రసారాలుసోషల్ మీడియాన్యాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు
జనరల్

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్
జనరల్

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం
జనరల్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!
గాసిప్స్

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్
రాజకీయాలు

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్

ఓటీటీ డీల్‌పై టాక్సిక్‌కు ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఆఫర్?
ఓటీటీ

ఓటీటీ డీల్‌పై టాక్సిక్‌కు ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఆఫర్?

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...
జనరల్

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
రాజకీయాలు

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?
షోస్

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?

సోనీ లివ్‌లోకి లోకేష్ కనకరాజ్ డీసీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీ

సోనీ లివ్‌లోకి లోకేష్ కనకరాజ్ డీసీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

16GB RAM, భారీ బ్యాటరీతో iQOO Neo 12.. లీకైన కీలక ఫీచర్లు!
టెక్నాలజీ

16GB RAM, భారీ బ్యాటరీతో iQOO Neo 12.. లీకైన కీలక ఫీచర్లు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10  ప్రోమో 1:‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో అపూర్వకు షాక్!
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో 1:‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో అపూర్వకు షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!