
జనరల్

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయం కళకళలాడగా, హుండీ కానుకల ద్వారా మొత్తం రూ.137.44 కోట్ల ఆదాయం సమకూరింది. నెలలో మూడు సార్లు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటడం విశేషం.
ఆగస్టు 18న ఒక్కరోజే భక్తులు హుండీ ద్వారా అత్యధికంగా రూ.6.12 కోట్ల కానుకలు సమర్పించారు. ఇదే నెలలో 10.50 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!