
క్రీడలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అల్పాహారం, పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. వారానికి 6 రోజులు అల్పాహారంతో పాటు పాలు, రాగి జావా అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్ల వ్యయం చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!