
రాజకీయాలు

నార్వే చెస్ 2026 సిరీస్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్నానందకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థ తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రోత్సాహకంగా అందజేశారు.
ఈ విజయంతో ప్రగ్నానందా నార్వే చెస్ సిరీస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. యువ గ్రాండ్‌మాస్టర్ ప్రతిభను అభినందిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. చెస్ ప్రపంచంలో భారత్ కీర్తిని మరింత పెంచిన ఘనతగా ఇది నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!