

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ–2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీ కోసం ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు దరఖాస్తుకు ముందు ప్రాస్పెక్టస్‌లోని అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పూర్తిగా పరిశీలించాలని సూచించింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసి, అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్ వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!