
జనరల్

నీట్ పోర్టల్‌లో భారీ లోపం వెలుగులోకి వచ్చింది. అభ్యర్థుల పాస్‌వర్డ్లు, పిన్ నంబర్లను దొంగిలించి రీఫండ్ డబ్బులను మోసం చేసిన బిహార్‌కు చెందిన 19 ఏళ్ల నవీన్ యాదవ్‌ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల ప్రొఫైల్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలను తొలగించి, తన ఖాతా వివరాలను అప్డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
దీంతో ప్రతి విద్యార్థికి రావాల్సిన ₹1,700 రీఫండ్ అతడి ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. మొదట రద్దైన నీట్ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు ఫీజు రీఫండ్ చేస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించి నిందితుడు అనేక లావాదేవీలను మళ్లించాడని దర్యాప్తులో వెల్లడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!