
ఓటీటీ

దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, జమ్మూకశ్మీర్‌లోని తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతాల తిరుగుబాట్లు దాదాపు అంతరించిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం జగ్దల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కచ్చితమైన ప్రణాళికతో రాష్ట్రాన్ని నక్సల్ రహితంగా మార్చామని తెలిపారు.
ఈ సందర్భంగా వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్‌కుమార్, ఎస్ఐబీ మాజీ ఐజీ మరియు ప్రస్తుత మల్కాజిగిరి కమిషనర్ సుమతి తదితరులను అమిత్ షా సత్కరించారు. మావోయిస్టులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన వెయ్యికి పైగా భద్రతా సిబ్బందికి అమర్ వాటికాలో నివాళులు అర్పించారు. భద్రతా బలగాల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!