

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు ఆదిశక్తి ఆరాధనకు అత్యంత విశిష్టమైన పర్వదినాలు. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని నవదుర్గలుగా ప్రసిద్ధి చెందిన తొమ్మిది రూపాల్లో భక్తులు పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి రూపాల్లో అమ్మవారిని ఆరాధించడం సంప్రదాయం. ఈ రూపాల్లో ప్రతి ఒక్కదానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నవదుర్గలను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, సుఖశాంతులు, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
నవదుర్గల్లో శైలపుత్రి స్థైర్యానికి, బ్రహ్మచారిణి తపస్సు, జ్ఞానానికి, చంద్రఘంట వీరత్వానికి ప్రతీకలుగా నిలుస్తారు. కూష్మాండ దేవిని ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం, స్కందమాతను జ్ఞానం, శాంతి, సంతాన సౌభాగ్యం కోసం ఆరాధిస్తారు. కాత్యాయనీ శక్తికి, కాళరాత్రి దుష్టశక్తులపై విజయానికి, మహాగౌరి పవిత్రత, మంగళానికి ప్రతీకలుగా పూజలందుకుంటారు. సిద్ధిధాత్రి అష్టసిద్ధులను ప్రసాదించే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ తొమ్మిది రూపాలను నవరాత్రుల్లో పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఓం శ్రీ మాత్రే నమః.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు కొందరు నిపుణుల అభిప్రాయాలు, వివిధ శాస్త్రాల్లోని అంశాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిలోని అన్ని విషయాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ వివరాలను ఎంతవరకు విశ్వసించాలనేది పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!