

సచివాలయంలో టీ-ఫైబర్ సేవలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు వినియోగించాలని, ప్రైవేట్ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను నెలరోజుల్లో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని, ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీకి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులను మంత్రి సూచించారు.


కామెంట్స్ (1)
Good decision