

స్మార్ట్‌ఫోన్లను ఆయుధంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు ప్రజల ఆశ, భయాన్ని ఉపయోగించుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. 2026లో అత్యధికంగా ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ స్కామ్‌లు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధిక లాభాల ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, ఫేక్ జాబ్ ఆఫర్లు, మ్యాట్రిమోనియల్ మోసాలు, యూపీఐ మోసాలు ప్రధానంగా ఉన్నాయి.
2024లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,230 సైబర్ కేసులు నమోదయ్యాయి. 2025–26లో కేసుల సంఖ్య కొద్దిగా తగ్గినా, మోసాల తీవ్రత, నష్టం పెరుగుతోంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 78 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు “ఆపరేషన్ ఆక్టోపస్” పేరుతో 16 రాష్ట్రాల్లో దాడులు చేసి 74 కేసులకు సంబంధించి 117 మంది అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు.
విచారణలో వీరిపై దేశవ్యాప్తంగా 1,081 కేసులు ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా సుమారు రూ.139 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఛేదించిన 74 కేసుల్లో 63 ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, 6 డిజిటల్ అరెస్ట్ కేసులు, 4 ఓటీపీ మోసాలు, 1 సోషల్ మీడియా మోసం ఉన్నాయి. పోలీసులు నగదు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుని బాధితులకు సుమారు రూ.59 లక్షలు తిరిగి ఇప్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!