
గాసిప్స్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సిల్చార్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రచార కార్యక్రమంలో ఓ స్థానిక వ్యక్తి తన మేనల్లుడి కోసం ఐఫోన్ కావాలని సీఎంను కోరాడు. దీనికి హిమంత బిశ్వ శర్మ సరదాగా స్పందిస్తూ.. పాత మోడల్ కావాలా? కొత్త మోడల్ కావాలా? అని ప్రశ్నించారు.
అయితే ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా కొత్త ఐఫోన్‌నే కావాలని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. దీంతో సీఎం కూడా చిరునవ్వుతో.. ‘‘సరే.. నీకు ఐఫోన్ తెచ్చిస్తా’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో, వ్యక్తి ధైర్యంగా ఐఫోన్ అడిగిన తీరు చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!