

హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటే మహిళలు తమ శక్తిని ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని సూచించారు.
మహిళలు రాజకీయాల్లో శక్తివంతమైన స్థానాల్లో ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని కవిత అన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు కావాలని, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అత్యవసరమని పేర్కొన్నారు. ఒక స్థాయి వరకు ఎదిగిన మహిళలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకే మహిళా నాయకత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా బిల్లు అమలులో జాప్యం జరుగుతోందని కవిత విమర్శించారు. మహిళా బిల్లు కోసం జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించామని, 18 రాజకీయ పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. మహిళలు తమ ఓటు శక్తిని ఉపయోగించి హక్కులు సాధించుకోవాలని, తమ పార్టీలో మహిళలకు కనీసం 33 శాతం సీట్లు కేటాయిస్తామని, అవసరమైతే 50 శాతం వరకు అవకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!