

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రధాన మంత్రి పదవికి న్యాయవాది ఇఫ్తికార్ జిలానీని పాకిస్థాన్ పాలక పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నామినేట్ చేసినట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత గురువారం వెల్లడించారు. పీవోకే శాసనసభ శుక్రవారం లాంఛనంగా కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. మూడు విడతలుగా జరిగిన శాసనసభ ఎన్నికలు హింసాత్మక నిరసనలు, భారీ రిగ్గింగ్ ఆరోపణల మధ్య సాగాయి.
ముజఫరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జిలానీ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి సర్దార్ ముక్తార్ అహ్మద్ ఖాన్ అబ్బాసీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయనకు మద్దతుగా నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రచారం చేసినప్పటికీ విజయం దక్కలేదు. అనంతరం టెక్నోక్రాట్ కోటా ద్వారా జిలానీ శాసనసభకు ఎన్నికయ్యారు. 53 స్థానాలున్న పీవోకే అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, మిగిలిన ఎనిమిది స్థానాలను మహిళలు, టెక్నోక్రాట్లు, మతాధికారులకు కేటాయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!