
ఆరోగ్యం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదం తెలిపారు. గవర్నర్ మధ్యప్రదేశ్‌లో ఉండటంతో సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు సమర్పించారు. అనంతరం బెంగళూరుకు చేరుకున్న గవర్నర్ శుక్రవారం ఉదయం అధికారికంగా రాజీనామాను ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక వరకు సిద్ధరామయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

రాజీనామా అనంతరం సిద్ధరామయ్య సీనియర్ నేతలతో కలిసి దిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్‌తో ఆయన భేటీ కానున్నారు. కర్ణాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, కొత్త మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!