

రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందిస్తోందని ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు కలిసిన సందర్భంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులపై వారు వినతులు సమర్పించగా, ప్రభుత్వం దశలవారీగా అన్ని బకాయిలను చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చిన్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్ల ప్రతినిధులు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరిగిన చర్చల అనంతరం డిప్యూటీ సీఎంను కలసి వివరాలు తెలియజేశారు. ప్రభుత్వ హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి, ఈ నెల 18న నిర్వహించాల్సిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!