
ఆరోగ్యం

హైదరాబాద్‌లో యాపిల్ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టీ–హబ్ సమీపంలో అత్యాధునిక ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుండగా, దసరా నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కేంద్రంలో కస్టమర్ సర్వీస్‌తో పాటు కాల్ సెంటర్, బ్యాకెండ్ సపోర్ట్ సేవలను కూడా అందించనున్నారు. భవిష్యత్తులో దీనిని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)గా తీర్చిదిద్దే ప్రణాళికలను యాపిల్ రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తం మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఐటీ రంగానికి మరింత బలం చేకూర్చనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!