
బిజినెస్

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు, దీని ద్వారా కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందంతో నౌకల రవాణాపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయని, టోల్ వసూలు కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంలో ఇరాన్ అణ్వాయుధాల అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం.
ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటనల తర్వాత ఇరాన్ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. అమెరికా సైనిక చర్యలను నిలిపివేయడం, నౌకాదళ దిగ్బంధాన్ని తొలగించడం ఒప్పందంలో భాగమని ఇరాన్ తెలిపింది. జూన్ 19న అధికారిక సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం పశ్చిమాసియాను మార్చే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!