
జనరల్

తిరుమలలో ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందుగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!