

అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ మధ్యే హర్మూజ్ జలసంధిలో మరోసారి సైనిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అమెరికా నౌకలపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని యూఎస్ సైన్యం వెల్లడించింది. ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టామని, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. తమ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికానే ముందుగా కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా వైమానిక దాడుల్లో పౌర ప్రాంతాలు లక్ష్యంగా మారాయని తెలిపింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, పశ్చిమ టెహ్రాన్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్‌లో జరిగిన ఘర్షణలను ధ్రువీకరించారు. ఇరాన్ డ్రోన్లు, చిన్న పడవలతో అమెరికా డిస్ట్రాయర్లపై దాడులకు దిగిందని, వాటిని విజయవంతంగా తిప్పికొట్టామని తెలిపారు. త్వరగా ఒప్పందంపై సంతకం చేయాలని, లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!