
జనరల్

కేంద్ర రవాణా శాఖకు చెందిన వాహన్–సారథి పోర్టల్ క్లౌడ్ డేటాబేస్ తరచూ మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం కేంద్రం ఆధీనంలోకి వచ్చిన ఈ వ్యవస్థలో అన్ని రాష్ట్రాల నుంచి లాగిన్స్ భారీగా పెరగడంతో లోడ్ తట్టుకోలేక సిస్టమ్ కుప్పకూలుతోందని సమాచారం.
దీంతో దేశవ్యాప్తంగా 100కుపైగా ఆన్లైన్ రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తెలంగాణలో డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్స్ సేవలు నిలిచిపోవడంతో ఖైరతాబాద్ సహా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సేవలు ఇవాళ ఉదయం నుంచి పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!