

ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ఈరోజు ఉదయం లోగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని సమాచారం. రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణ హెచ్చరికలు కొనసాగనున్నాయి. కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలోని 11 జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. ప్రజలు అధికారిక వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని, వరద నీరు ప్రవహించే వాగులు, రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్, భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!