
జనరల్

మధ్యప్రదేశ్‌లోని సత్నా జైలులో చోటు చేసుకున్న ఒక విభిన్న ప్రేమకథ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. 2007 హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ధర్మేంద్రకు, అదే జైలులో విధులు నిర్వహించిన జైలర్ ఫిరోజాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసింది.
సుమారు 14 ఏళ్ల తర్వాత సత్ప్రవర్తన కారణంగా ధర్మేంద్ర విడుదలయ్యాడు. ఈ నెల 5న ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మత భేదాల కారణంగా ఫిరోజా కుటుంబం ఈ వివాహాన్ని వ్యతిరేకించినప్పటికీ, వీఎచ్‌పీ నేతల సమక్షంలో వివాహం జరిగినట్లు సమాచారం. ఈ జైలు ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!