

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు స్పందించారు. ఈ కేసులో నిష్పాక్షికంగా, ఆధారాల ఆధారంగా దర్యాప్తు జరగాలని కోరుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వ్యక్తిగత ప్రేమ సంబంధం విఫలమైందనే కారణంతో దానిని వెంటనే క్రిమినల్ కేసుగా పరిగణించకూడదని, ప్రజాభిప్రాయం కాకుండా సాక్ష్యాధారాల ఆధారంగానే నిజానిజాలు తేలాలని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని నాగేశ్వరరావు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే సస్పెన్షన్ విధించడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తయ్యే వరకు సమాన న్యాయం పాటిస్తూ పారదర్శక దర్యాప్తు నిర్వహించాలని, అలాగే ఉదయ్ కృష్ణారెడ్డికి శిక్షణ కొనసాగించే అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!