

రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం విద్యేనని, రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం విద్యాశాఖకు కేటాయించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యావారోత్సవాల్లో పాల్గొన్న ఆయన, సర్కారు బడులను పేదపిల్లలకు నాణ్యమైన విద్య అందించే దేవాలయాలుగా అభివర్ణించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో రూ.1,761 కోట్లతో నిర్మించనున్న పాఠశాలలకు శంకుస్థాపన చేసి, ఉపాధ్యాయులు బాధ్యతతో బోధించాలన్నారు.
విద్యలో మార్పుల కోసం చేపట్టిన సంస్కరణలతో మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకూ విద్య అందించే ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాగి జావ, పాలు అందిస్తామని చెప్పారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదగాలని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలన్నారు. రాష్ట్రంలో 11 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించామని, జాతీయ ప్రమాణాల కంటే మెరుగైన టీచర్-స్టూడెంట్ నిష్పత్తి ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు నగదు బహుమతులు అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!