

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించేందుకు కృషి చేసిన కార్మికులందరికీ సీపీఐ నేత నారాయణ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతుగా నిలిచిన మిత్ర కార్మిక సంఘాలను కూడా ఆయన అభినందించారు. కార్మికుల ఐక్యత ఈ విజయానికి కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతను కొనసాగించాలని కోరారు.
కార్మిక సంఘ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికార గర్వంతో “కమ్యూనిస్టులను ఓడించండి” అని పిలుపునిచ్చి ఎన్నికలను కాంగ్రెస్–కమ్యూనిస్టుల మధ్య రాజకీయ పోరుగా మార్చిందని నారాయణ విమర్శించారు. ఈ పరిణామానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఎంప్లాయీస్ యూనియన్‌తో పాటు మిత్ర కార్మిక సంఘాలు ఐక్యంగా నిలిచి, భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!